ఉత్సాహంగా వాట్స్ ఉగాది వేడుకలు

ఉత్సాహంగా వాట్స్ ఉగాది వేడుకలు

28-03-2018

ఉత్సాహంగా వాట్స్ ఉగాది వేడుకలు

వాషింగ్టన్‌ తెలుగు సమితి ఆధ్వర్యంలో సియాటెల్‌లో ఉన్న తెలుగువాళ్ళు విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను వైభవంగా జరుపుకున్నారు.  స్థానిక బెల్వ్యూ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు ఎంతోమంది హాజరయ్యారు. చిన్నారులు పెద్దలు సాంస్కృతిక వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన న త్యాలు, నాటకాలు, పాటలు, ఆలపించిన శ్లోకాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.  ఉగాది పంచాంగ శ్రవణం, పసందైన విందు భోజనం ఇంటివాతావరణాన్ని తలపింపజేశాయి. గాయని శిల్పారావు మరియు ఎన్నో కొత్త సినిమాల్లో పాటలు పాడిన యువ గాయకుడు నరేంద్ర తమ హుషారైన పాటలతో ప్రేక్షకులని ఉర్రూతలూగించారు. చివరిగా వాట్స్‌ అధ్యక్షురాలు అను గోపాళం, ఉపాధ్యక్షులు రాం పాలూరి మరియు ఇతర కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో వాట్స్‌ ఇంకా మున్ముందు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలియచేసారు.

Click here for Event Gallery