ట్రంప్‌ను తొలగించారని తెలిసి..
APEDB

ట్రంప్‌ను తొలగించారని తెలిసి..

19-04-2017

ట్రంప్‌ను తొలగించారని తెలిసి..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదవి నుంచి తొలగించారు అని తన మాజీ భార్య చెప్పిన మాట విని ఓ వృద్ధుడు ప్రశాంతంగా కన్నుమూసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన మైఖేల్‌ గార్‌లాండ్‌ ఇలియట్‌(75)కు రాజకీయాలపై ఆసక్తి ట్రంప్‌ విధానాలను వ్యతిరేకించే ఆయన కొద్దికాలంగా హృద్రోగంతో బాధపడుతున్నారు. మంచానికి పరిమితమై కొన ఊపిరితో ఉన్న ఇలియట్‌కు ట్రంప్‌ను పదవి నుంచి తొలగించారన్న వార్తను ఆయన మాజీ భార్య థెరీసా(68) ఫోన్‌లో చెప్పగానే ఏప్రిల్‌ 6న ప్రశాంతంగా కన్నుమూసినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇరవై ఏళ్ల క్రితమే ఇలియట్‌తో విడిపోయిన థెరిసా మాట్లాడుతూ, ఇలియట్‌ చివరి ఘడియల్లో ఉన్నాడని తనకు తెలుసనీ, అందుకే అలా చెప్పాల్సి వచ్చింది అన్నారు.