Telangana Tourism
Karur Vysya Bank
Manjeera Monarch

బీట్‌రూట్‌ రసం తో మెదడుకు యవ్వనం

20-04-2017

బీట్‌రూట్‌ రసం తో మెదడుకు యవ్వనం

వ్యాయామానికి ముందు బీట్‌రూట్‌ రసం తాగితే మెదడు చురుగ్గా మారుతుందని సూచిస్తోంది తాజా అధ్యయనం. సాధారణంగా వ్యాయామం చేసినప్పుడు మెదడులోని సొమాటోమోటార్‌ కార్టెక్స్‌ భాగం బలోపేతమవుతుంది. వ్యాయామానికి బీట్‌రూట్‌ రసం తోడైతే, సొమాటోమోటార్‌ కార్టెక్స్‌ బలోపేతానికి అత్యంత అనుకూల వాతావరణం ఏర్పడుతోందని అమెరికాలోని వేక్‌ ఫారెస్ట్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు తాజాగా నిర్థారించారు. బీట్‌రూట్‌తో మెదడుకు ప్రాణవాయువు (ఆక్సిజన్‌) అధికంగా అందుతుండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. బీట్‌రూట్‌ తీసుకున్నవారిలో నైట్రేట్‌, నైట్రైట్‌ల స్థాయి బాగా పెరుగుతోందని, వృద్ధుల్లో కూడా మెదడు యవ్వన దశలోని మెదడులా చురుగ్గా పనిచేస్తోందని పేర్కొన్నారు.