సైనిక్‌పురిలో కొత్త ప్రాజెక్ట్‌
MarinaSkies
Kizen
APEDB

సైనిక్‌పురిలో కొత్త ప్రాజెక్ట్‌

14-03-2017

సైనిక్‌పురిలో కొత్త ప్రాజెక్ట్‌

మధ్యతరగతి వాసులకు అందుబాటు ధరలో ఇళ్లను అందించేందుకు సైనిక్‌పురిలో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు జనప్రియ ఇంజినీర్స్‌ సిండికేట్‌ ఛైర్మన్‌ కె.రవీందర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. సైనిక్‌పురిలో లేక్‌వ్యూ ప్రాజెక్ట్‌లోనే ఇప్పటికే ఉంటున్న నివాసాల నడమ ‘సితార’ పేరుతో అందుబాటు ధరలో ఇళ్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. 5.5 ఎకరాల విస్తీర్ణంలో ఒక్కోటి 10 అంతస్తుల్లో నాలుగు బ్లాక్‌లను నిర్మించనున్నట్లు చెప్పారు. ప్రధాన మంత్రి అవాస్‌ యోజన కింద కేంద్రం ప్రకటించిన రూ.12 లక్షల వరకు 3 శాతం వడ్డీ సబ్సిడీ.. తగ్గిన గృహరుణ వడ్డీరేట్లను దృష్టిలో పెట్టుకుని రూ.14.99 లక్షలకు రెండు పడకగదుల ఇళ్లను అందివ్వబోతున్నట్లు చెప్పారు. మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలకు ఇంటి అద్దెతో సొంత ఇల్లు సమకూర్చుకునేలా ప్రాజెక్ట్‌ను ప్రారంభించామన్నారు. ఈత కొలను, క్లబ్‌హౌజ్‌ వంటి సకల సౌకర్యాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. అందుబాటు ధరల్లో ఇళ్లను మియాపూర్‌, నాచారంలో తర్వాతి దశలో చేపట్టనున్నామని దీనికి సంబంధించి డిమాండ్‌ సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు.