కాలిఫోర్నియాలో నాటా విరాళాల సేకరణ సక్సెస్

కాలిఫోర్నియాలో నాటా విరాళాల సేకరణ సక్సెస్

18-04-2018

కాలిఫోర్నియాలో నాటా విరాళాల  సేకరణ సక్సెస్

ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలో పెద్ద ఎత్తున విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. జులై నెలలో నాటా ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో ఏర్పాటు చేసిన తెలుగు మహాసభలకోసం చేపట్టిన విరాళాల సేకరణకు మంచి స్పందన లభిస్తున్నట్లు నాటా అధ్యక్షుడు గంగసాని రాజేశ్వర్‌ రెడ్డి తెలిపారు. నాటా వ్యవస్థాపకుడు డా. ప్రేమ సాగర్‌ రెడ్డి ఆధ్వర్యంలో లాస్‌ ఏంజిల్స్‌ సమీపంలోని ఆయన స్వగ హంలో నిర్వహించిన విరాళాల సేకరణ కార్యక్రమంలో 300లక్షల డాలర్లు వసూలు అయ్యాయి. అదే విధంగా మస్కట్‌ లోనూ సాండీయాగోలో నిర్వహించిన విరాళాల సేకరణకు మంచి స్పందన లభించినట్లు రాజేశ్వర్‌ రెడ్డి తెలిపారు. డా. సురేంద్ర నాద్‌ రెడ్డి, డా. అన్నపూర్ణారెడ్డి, డా. మనోరమ రెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు విరాళాల సేకరణకు సహకరించారు.

Click here for Event Gallery