తానా మహాసభలకు జయరామ్ కోమటి విరాళం 25వేల డాలర్లు
APEDB
Ramakrishna

తానా మహాసభలకు జయరామ్ కోమటి విరాళం 25వేల డాలర్లు

23-04-2017

తానా మహాసభలకు జయరామ్ కోమటి విరాళం 25వేల డాలర్లు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మే 26, 27, 28 తేదీల్లో సెయింట్‌లూయిస్‌లో నిర్వహించనున్న 21వ మహాసభల కోసం వివిధ నగరాల్లో నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బే ఏరియాలో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. మిల్‌పిటాస్‌లోని స్వాగత్‌ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దాదాపు 2 లక్షల డాలర్ల విరాళం ఇచ్చేందుకు ఎంతోమంది ముందుకు వచ్చారని తానా అధ్యక్షుడు జంపాల చౌదరి తెలిపారు. తానా మాజీ అధ్యక్షుడు జయరామ్‌ కోమటి తనవంతుగా 25వేల డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. సతీష్‌ వేమూరి, విజయ ఆసూరి, రజనీకాంత్‌ కాకరాల, వెంకట్‌ కోగంటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.