సిలికానాంధ్ర ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలో టీం ఎయిడ్ అవగాహనా సదస్సు !

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలో టీం ఎయిడ్ అవగాహనా సదస్సు !

06-06-2018

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలో టీం ఎయిడ్ అవగాహనా సదస్సు !

ప్రవాసంలో నివసిస్తున్న భారతీయులకు అత్యవసర సమయాల్లో చేయూత ఇవ్వాలనే సంకల్పంతో ప్రారంభింపబడిన సంస్థ టీం ఎయిడ్ (Team Aid). లాభాపేక్షలేని ఈ సంస్థ పూర్తిగా స్వచ్ఛంద సేవకుల అంకితభావంతోనే నడుస్తున్నది. తమ సేవలను అమెరికాలోని 50 రాష్ట్రాల్లో  విస్తరింపజేయాలనే ప్రయత్నంలో కాలిఫోర్నియాలోని బే ఏరియాలో అవగాహనా సదస్సు నిర్వహించింది. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ సభకు టీం ఎయిడ్ సంస్థ వ్యవస్థాపకుడు నన్నపనేని మోహన్, టీవీ9 ముఖ్య కార్య నిర్వహణాధికారి రవి ప్రకాష్, సిలికానాంధ్ర చైర్మన్ కూచిభొట్ల ఆనంద్, వైస్ చైర్మన్ కొండిపర్తి దిలీప్ తో బాటు సిలికాన్ వ్యాలీలోని ఇతర ప్రముఖులు హాజరయ్యారు. 

బే ఏరియాలోని వివిధ రాష్ట్రాల సంఘాలను సమన్వయపరిచి ఈ కార్యక్రమ నిర్వహణకు నాయకత్వం వహించిన సిలికానాంధ్ర వైస్ చెయిర్‌మెన్ దిలీప్ కొండిపర్తి మాట్లాడుతూ ఎంతటి వివేకవంతులైనను ఆపద సమయాల్లో అయోమయంతో ఏం చెయ్యాలో పాలుపోని  పరిస్థితులో పడతారని, అలాంటివాళ్ళను ఆదుకోవలసిన అవసరం తోటి ప్రవాసుల నైతిక బాధ్యత అని,ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం కన్నా వేరే సేవ ఉండదని, టీం ఎయిడ్ చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి సిలికానాంధ్ర తమ జగమంత కుటుంబంతో ఎల్లప్పుడూ సహకరిస్తుందని అన్నారు. 

నన్నపనేని మోహన్ టీం ఎయిడ్ ఎలా పనిచేస్తుందో వివరిస్తూ కొన్ని ఉదాహరణలను కూడా పేర్కొన్నారు. బంగారు భవిష్యత్తును ఆశిస్తూ స్వదేశాన్ని విడిచి వచ్చిన వారికి ఏలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినను భుజం తట్టి సహాయం చేయాలనే సదుద్దేశంతో టీం ఎయిడ్ ప్రారంభింపబడిందని తెలిపారు. టీం ఎయిడ్, ఏ ఇతర కమ్యూనిటీ సంస్థలకు పోటీ కాదని, అమెరికా పోలిసులతో బాటు, విదేశాంగ ప్రతినిధులతో, భారతదేశంలోని అధికారులతో కలిసి పనిచేస్తుందని చెప్పారు.

అమెరికాలోని భారతీయ సంస్థలన్నిటినీ కలుపుకుంటూ, ఒక కేంద్రీయ సహాయ కేంద్రంగా పనిచెస్తుందని తెలిపారు. ఆపద సమయాల్లో సమయం వృధా కాకుడదని, ఎంత త్వరగా మేలుచేస్తే అంతటి ఊరట కలుగుతుందని చెప్పారు.

టీవీ 9 సీయీఓ రవి ప్రకాష్ మాట్లాడుతూ తాను స్వయంగా నన్నపనేని మోహన్ కార్యదీక్షతను చూసి అబ్బురపోయానని అన్నారు. ప్రవాస  భారతీయ సంఘాలన్నీ కుల మత భాష జాతి వివక్ష లేకుండా టీం ఎయిడ్  తో కలిసి పనిచేస్తే బాగుంటుందని ఆశించారు. కార్యక్రమంలో సిలికానాంధ్ర సన్స్థాపక అద్యక్షులు ఆనంద్ కూచిభొట్ల, సీ ఈ ఓ రాజు చమర్తి, సీ ఎఫ్ ఓ దీనబాబు కొండుభట్ల ఇతర సభ్యులు పాల్గొన్నారు.

శ్రీ రాజ్ భనోత్ (హిందూ టెంపుల్ అంద్ కమ్యునిటీ సెంటర్ (సన్నివేల్)), నీరజ్ భాటియా (ఇండో-అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్) తో పాటు బే ఏరియాలోని Bay Area Tamil Mandram, Manca (Malyali Assn), Bay Malyali Assn, MAITRI (Malayali), Sunnyvale Hindu Temple, Spectrum Church, San Jose Gurudwara, Bay Area Phabhasi (Bengali Assn), UPMA (Utter Pradesh), Maharastra Mandal, Indo-American Chamber of Commerce, Orissa Assn, Bubhaneshwar Sister Cities of Cupertino, Kashmiri Assn, Indian Muslim Relief and Charities (IMRC), Punjab Foundation, Sewa Internaltional, APPAPA, Rana ( Rajastan Assn ), Sindhi Assn, Akali Dal (Punjabi) సంఘాల ప్రతినిధులు సభకు హాజరయ్యి తమ సంఘీభావాన్ని తెలుపుతూ టీం ఎయిడ్ తో కలిసి పనిచెయ్యడం ముదావహమని చెబుతూ ఆ సంస్థ కార్యకలాపాల్లో భాగస్వామ్యం అవుతామని, టీం ఎయిడ్ ప్రయోజనాలని వారివారి సంస్థ/సంఘ సభ్యులందరికీ చేరవేస్తామని, టీం ఎయిడ్ కు విస్తృత ప్రచారం కల్పించి అవసరమైన వారికి సాయం అందేలా సహకరిస్తామని అన్నారు.   

Click here for Event Gallery