ట్రెడా ప్రాపర్టీ షో ప్రారంభం

ట్రెడా ప్రాపర్టీ షో ప్రారంభం

18-10-2019

ట్రెడా ప్రాపర్టీ షో ప్రారంభం

హైదరాబాద్‌ నగరంలోని హైటెక్స్‌లో ట్రెడా ప్రాపర్టీ షో ప్రారంభమైంది. మూడు రోజుల పాటు కొనసాగే ఈ ప్రాపర్టీ షోని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను కూడా బిల్డర్‌నేనని, బిల్డర్స్‌ సమస్యలు తనకు తెలుసని అన్నారు. సమాజం బాగుంటేనే బిల్డర్స్‌ అభివృద్ధి చెందుతారన్నారు. రాష్ట్రాభివృద్ధిపై సీఎం కేసీఆర్‌కున్న నిబద్దత వెలకట్టలేనిదన్నారు. హైదరాబాద్‌ ఐటీ, ఫార్మా రంగాల్లో ముందుందన్నారు. నిజాం కాలం తర్వాత మళ్లీ కేసీఆర్‌ ప్రభుత్వమే భూరికార్డుల ప్రక్షాళన చేసిందన్నారు. తెలంగాణ ప్రధాన ఆదాయ వనరు హైదరాబాద్‌ నగరమే అన్నారు. హైదరాబాద్‌లో లా అండ్‌ ఆర్డర్‌ నియంత్రణలో ఉందన్నారు. హైదరాబాద్‌ తాగునీటి కోసం నగరం చుట్టూ రెండున్నరేళ్లలో 65 రిజర్వాయర్లు నిర్మించామన్నారు. నగరం నలువైపు పరిశ్రమలు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.