బే ఏరియాలో 'పాఠశాల' వసంతోత్సవం 2017
APEDB
Ramakrishna

బే ఏరియాలో 'పాఠశాల' వసంతోత్సవం 2017

02-06-2017

బే ఏరియాలో 'పాఠశాల' వసంతోత్సవం 2017

అమెరికాలోని తెలుగు చిన్నారులకు తెలుగు నేర్పిస్తున్న 'పాఠశాల' వసంతోత్సవ వేడుకలు జూన్‌ 4వ తేదీన నిర్వహిస్తున్నారు. సన్నివేల్‌లోని సన్నివేల్‌ టెంపుల్‌ ఆడిటోరియంలో జరిగే ఈ వేడుకల్లో పాఠశాల చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎన్నారై పిల్లలకోసం ప్రవేశపెట్టిన తెలుగు పలుకు కోర్స్‌ను పాఠశాల నేర్పిస్తున్న సంగతి తెలిసిందే. నాన్‌ ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌ సర్టిఫికెట్‌ పొందిన పాఠశాల సులభంగా తెలుగును నేర్పించే సిలబస్‌తో విద్యార్థులను ఆకట్టుకుంటోంది. ఈసారి వసంతోత్సవంలో పాఠశాల చిన్నారుల ప్రతిభా పాటవాలను స్వయంగా చూడాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.