శాన్ ఫ్రాన్సిస్కోలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
MarinaSkies
Kizen
APEDB

శాన్ ఫ్రాన్సిస్కోలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

06-06-2017

శాన్ ఫ్రాన్సిస్కోలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

బే ఏరియాలో తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (టీసీఏ) ఆధ్వర్యంలో పలువురు ఎన్ఆర్ఐల సహకారంతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు  జరిగాయి. గత 14 ఏళ్లుగా తెలంగాణ సంస్కృతిని ప్రతిభింబించేలా టీసీఏ, ఎన్ఆర్ఐలు పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా శాన్ జోస్ లోని చారిత్రక గౌడలుపే పార్క్ లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. పార్క్ పరిశుభ్రతకు శ్రమదానం చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా భాస్కర్ కల్వ తెలంగాణ జానపద గేయాన్ని చక్కగా ఆలపించారు.  ధనుంజయ బోడ కుటుంబం తెలంగాణ వంటకాలైన అరిసెలు, సకినాలను తెచ్చి అందరకీ రుచి చూపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో ఎన్ఆర్ఐల పిల్లలు నేహారెడ్డి బోడ, శ్రేయ్ కొత్త, అమిత్ మెట్టపల్లి, హన్నాలు స్వచ్ఛందంగా వాలంటీర్లుగా ముందుకొచ్చి పనిచేశారు. టీసీఏ వ్యవస్థాపక సభ్యుడు బిక్షం పాలబిందెల, శ్రీనివాస్ గుజ్జు, చందు సిరామదాస్, విజయలక్ష్మి కనికరం, తదితరులు ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కృషిచేసిన వాలంటీర్ల సేవలను కొనియాడారు.   టీసీఏ వ్యవస్థాపక సభ్యులు విజయ్ చవ, టీసీఏ అధ్యక్షులు ధనంజయ బోడ, సబితా బోడ, మహిపాల్ అన్నం, వినోయ్ మేరెడ్డి, సాగర్ కొత్త, ప్రవీణ్ గరపల్లి, విష్ణు మెట్టపల్లి, సుశీల్.కె, క్రిష్ణమూర్తి వేముల, భాస్కర్ కల్వ, సుస్మిత అన్నాడి, రవి అనంత, తదితరులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.


Click here for Event Gallery