ఘనంగా శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు

ఘనంగా శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు

12-06-2017

ఘనంగా శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు

వాసవీ సేవా ఫౌండేషన్(వి.ఎస్.ఎఫ్)అధ్వర్యంలో బేఏరియాలో శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు బాలాజీ దేవాలయ ప్రాంగణం శాన్ హోసేలో మే 5వ తేదీన, వేద దేవాలయ ప్రాంగణంలో మిల్పీటాస్లో  మే 6తేదీన, లివర్ మూర్ శివ-విష్ణు దేవాలయప్రాంగణంలో మే 21వ తేదీన మూడు రోజులు ఘనంగా జరిగాయి. శ్రీవాసవి అమ్మవారి సందేశాలైన ధర్మం, శీలం, అహింసలనే పరమావధిగా చేసుకుని బేఏరియాలోని 650 మంది ప్రవాసభక్తులు వారి కుటుంబాలతో హాజరయి పూలమాలలు, యాలుకలతో తయారుచేసిన విశేషమైన మాలలతో అమ్మవారినిఅలంకరించి సాంప్రదాయ బద్ధంగా అంతఃకరణ శుద్ధితో,  భక్తి,  శ్రద్ధలతో  శ్రీవాసవీ మాతను సేవించుకున్నారు.

దేవాలయ ప్రధాన అర్చకులు నారాయణ స్వామి గారు, బ్రహ్మశ్రీ మారేపల్లి నాగవెంకట శాస్త్రిగారు, బ్రహ్మశ్రీ శ్రీధర భట్టాచార్య వార్లు అమ్మవారికి అభిషేకం, మూలమంత్ర హోమము, పూర్ణాహుతి తర్వాత, ఆమ్మవారి ఉత్తరపూజ జరిపించి, సువాసినీ లతో సహస్రనామం, కుంకుమార్చన చేయించారు.  మంత్రపుష్ప సమర్పణ అనంతరం వేదపండితులు భక్తులను ఆశీర్వదించి తీర్ధప్రసాదాలను అందజేశారు.

అనంతరం వి.ఎస్.ఎఫ్. అధ్వర్యంలో మహాప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. వేడుకలలో పాల్గొన్న ప్రవాస భక్తులు వారి

కుటుంబాలకు వాసవీ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపక శ్రేష్ఠులు రావు పానుగంటి, అధ్యక్షులు  శ్రీని కొనకళ్ళ,  వారి కార్యవర్గం రాం శ్రీపతి, సాయిప్రసాద్ భవ్గి, బాలాజి కేసర్ల, ఉమా శంకర్ మేడా  గార్లు  అభినందించి శుభాకాంక్షలను అందజేశారు.

Click here for Event Gallery