కాలిఫోర్నియాలో తెదేపా ప్రతినిధుల సమావేశం

కాలిఫోర్నియాలో తెదేపా ప్రతినిధుల సమావేశం

23-07-2017

కాలిఫోర్నియాలో తెదేపా ప్రతినిధుల సమావేశం

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం బే ఏరియాలో తెదేపా బే ఏరియా ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న కోమటి జయరాం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా గుంటూరు మిర్చియార్డు ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మన్నవ మాట్లాడుతూ తెదేపా వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు ఒక తరాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన స్థాపించిన తెదేపా తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు. ప్రపంచ దేశాల్లో తెలుగు ప్రజలు స్థిరపడటానికి తెదేపా ప్రభుత్వ విధానాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషే కారణమని తెలిపారు. ప్రవాసాంధ్రులు ఏపీలో చోటు చేసుకుంటున్న ప్రతి పరిణామాన్నీ గమనిస్తున్నారనీ, వారంతా నవ్యాంధ్ర అభివృద్ధికి మరింత కృషి చేయాలని సూచించారు.

 

Click here for PhotoGallery