రియల్‌ రంగంలో పుంజుకున్న హైదరాబాద్‌

రియల్‌ రంగంలో పుంజుకున్న హైదరాబాద్‌

26-07-2017

రియల్‌ రంగంలో పుంజుకున్న హైదరాబాద్‌

రాష్ట్ర విభజన అనంతరం గణనీయంగా పడిపోయిన రియల్‌ ఎస్టేట్‌ రంగం మళ్ళీ తన వైభవాన్ని చాటుతోంది.  2015-16లో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ పూర్తిగా స్తంభించిపోగా, 2016 ఆర్థిక సంవత్సరంలో కొెంతమేరకు మెరుగుపడి గడిచిన ఆరు నెలల్లో గణనీయంగా వృద్ధిని చూపుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యంంగా హైదరాబాద్‌ నగర పరిసరాల్లో భారీఎత్తున సాగిన భూములు, ఇళ్ళ స్థలాలు క్రయ విక్రయాలు గత ఏడాది స్తంభించిపోగా, అవికూడా ఇప్పుడిప్పుడే గాడిలో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

హైదరాబాద్‌ లో రెసిడెన్షియల్‌ మార్కెట్‌కు డిమాండ్‌ పెరగడంతో 2016-17 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో మార్కెట్‌కు మంచి స్పందన రాగా, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో అంతేస్థాయిలో డిమాండ్‌ పెరుగుతూ వస్తోందని నైట్‌ ఫ్రాంక్‌ అధ్యయనంలో పేర్కొంది. మధ్య తరగతి వర్గాలకు చెందిన ఫ్లాట్లకు డిమాండ్‌  పెరగడంతో రెసిడెన్షియల్‌ రంగం మళ్ళీ పుంజుకున్నట్లయింది. ఈ వర్గాలకు చెందిన  ఇళ్ళకు 30 నుంచి 50 లక్షల వరకు ధరల పలుకుతుండగా, మొత్తం మార్కెట్‌లో 60శాతం వాటా ఈ కేటగిరిలకే డిమాండ్‌ ఉన్నది. 50 నుంచి 75 లక్షల వరకు 20శాతం, ఆ పైన కోటీ రూపాయల విలువజేసే విల్లాలకు 20 శాతం మేరకే మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. 2014-15లో రియల్‌ ఎస్టేట్‌ రంగంతో పాటు విల్లాలకు భారీగా డిమాండ్‌ ఏర్పడడంతో అనేక  భవన నిర్మాణ సంస్థలు  వాటికే ప్రాధాన్యత ఇచ్చాయి. సంపన్న వర్గాల  నుంచి గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, కొండాపూర్‌, మణికొండ, మియపూర్‌ ప్రాంతాల్లో విల్లాలకు డిమాండ్‌ ఉ ండగా, నగరం చుట్టూ మధ్య తరగతి వర్గాల ఇళ్ళకు డిమాండ్‌ ఉన్నట్టు నైట్‌ ఫ్రాంక్‌ సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో  మధ్య తరగతి వర్గాల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకున్న బిల్డర్లు ఆ వర్గాల రెసిడెన్షియల్‌ కాంపెక్ల్స్‌ నిర్మాణాలకే మొగ్గు చూపుతున్నట్లు ఆ అధ్యనం వెల్లడించింది.

రాష్ట్ర విభజన అనంతరం పరిస్థితులు చక్కబడడంతో మళ్లీ రియల్‌ ఎస్టేట్‌ రంగం పుంజుకుంటుందని క్రెడాయ్‌ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. గత ఏడాది చివరిలో మార్కెట్‌లో కదలిక వచ్చిందని,  ఇది ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఆశాజనకంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్‌లో మళ్ళీ పూర్వస్థితికి మారె ్కట్‌ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా,  2016-17లో అనేక మెట్రో నగరాల్లో ఆశించినన  మేరకు డిమాండ్‌ లేకపోవడంతో రెసిడె న్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం స్తంభించిపోయిందని ఆ అధ్యయనం వెల్లడించింది. 2016-17 లో కేవలం 41 శాతం మాత్రమే విక్రయాలు జరగ్గా, పెద్దనోట్లు  రద్దయిన తర్వాత మార్కెట్‌ బాగా ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవలసి వచ్చిందని అధ్యయనంలో వెల్లడించాయి. అయితే కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాలకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదని, కేవలం రెసిడెన్సియల్‌  కాంప్లెక్స్‌లకు మాత్రమే తగ్గిందని పేర్కొంది. అయితే ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల ఉద్యోగులకు హౌసింగ్‌ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడంతో మధ్య తరగతి వర్గాల ఇళ్ళకు గారికీ పెరిగినట్లు నైట్‌ ఫ్రాంక్‌ అధ్యయనం పేర్కొంది. బాంబే,ఢిల్లీ, చెన్నై బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో గత ఏడాది నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి.  ఈ పరిస్థితి మెరుగపడి 201|-18లో మళ్లీ పుంజుకుంటుందని ఫిక్కీ నైట్‌ ఫ్రాంక్‌ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో తెలిపారు.

మెట్రో నగరాల్లో రెండున్నర లక్షల యూనిట్లు నిర్మాణంలో నిలిచిపోయాయని, అయితే వీటికి ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో మళ్లీ డిమాండ్‌ వస్తుందని పేర్కొంది. ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం అదుపులో  ఉంటే ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం నాటికి మార్కెట్‌ పూర్తిగా పుంజుకుంటుందనిఆ అధ్యయనంలో వెల్లడించింది.

భారత రియల్‌ ఎసేట్ట్‌ రంగంలో 2016లో విదేశీ పెట్టుబడులు 137 శాతం పెరిగాయని నైట్‌ ఫ్రాంక్‌ క్యాపిటల్‌ యాక్టివ్‌ రిపోర్టు పేర్కొంది. అమెరికా, కెనడా, సింగపూర్‌ దేశాలకు చెందిన ఇన్వెసర్లు దేశంలోని అనేక నగరాల్లో భారీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాయి.  2011-13లో భారత్‌లో 320 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టగా, 2014-16 నాటికి 137 శాతం వృద్థితో అవి 760 కోట్ల డాలర్లు పెరిగాయి. అలాగే దేశీయ బిల్డర్లు కూడా ఇదేకాలంలో 130 కోట్ల డాలర్ల నుంచి 240 కోట్ల డాలర్లకు పెట్టుబడులు పెట్టినట్లు ఆ అధ్యయనం తెలిపింది. ఈ పెట్టుబడుల్లో ముంబైలో 39 శాతం, గుర్గావ్‌ 32 శాతం, బెంగళూరులో 11 శాతం, చెన్నైలో 10 శాతం, ఢిల్లీలో 4 శాతం, ఇతర నగరాల్లో 4 శాతం మేరకు పెట్టుబడులు పెట్టినట్లు ఆ సంస్థ వెల్లడించింది. అయితే విదేశీ సంస్థల పెట్టుబడుల్లో 80శాతం భారీ కమర్షియల్‌ కాంప్లెక్స్‌లకే పరిమితం కాగా, కేవలం 20శాతం మాత్రం అత్యంత విలాసవంతమైన రెసిడెన్షియల్‌ విల్లా ప్రాజెక్టులకు కేటాయించినట్లు పేర్కొంది.