రెరా కు సిఎం గ్రీన్ సిగ్నల్

రెరా కు సిఎం గ్రీన్ సిగ్నల్

01-08-2017

రెరా కు సిఎం గ్రీన్ సిగ్నల్

తెలంగాణ స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి చట్టం (రెరా)కు సిఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (రెరా) చట్టానికి అనుగుణంగా రెగ్యులేటరీ అథారిటీని ప్రభుత్వం రూపొందించింది. ఈ చట్టాన్ని జూలై 31లోగా రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం ఆదేశించడంతో గడువులోగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్‌పై అభ్యంతరాలను ఆగస్టు 15 వరకు స్వీకరిస్తారు. నోటిఫికేషన్ ముసాయిదాకు అభ్యంతరాల స్వీకరణ తర్వాత తెలంగాణ స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి చట్టానికి మంత్రిమండలి ఆమోదం తెలుపుతుంది. సెప్టెంబర్ 1 నుంచి చట్టం అమలులోకి వస్తుంది. రాష్టవ్య్రాప్తంగా నగరాలు, పట్టణాల్లో జనవరి ఒకటి 2017 తర్వాత అనుమతి పొందిన నిర్మాణాలు ఈ చట్టం పరిధిలోకి రానున్నాయి.