బే ఏరియాలో జస్టిస్‌ చలమేశ్వర్‌కు ఘన సన్మానం

బే ఏరియాలో జస్టిస్‌ చలమేశ్వర్‌కు ఘన సన్మానం

09-10-2017

బే ఏరియాలో జస్టిస్‌ చలమేశ్వర్‌కు ఘన సన్మానం

బే ఏరియాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చలమేశ్వర్‌ను ఎన్నారై ప్రముఖులు ఘనంగా సన్మానించారు. అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండో అమెరికన్స్‌, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో  ఫ్రీమాంట్‌లోని రేషం ఈవెంట్‌ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జస్టిస్‌ చలమేశ్వర్‌ మాట్లాడుతూ, ఎన్నారైలు ఇక్కడ అభివృద్ధికి తోడ్పడినట్ల్లుగానే జన్మభూమి అభివృద్ధికి కూడా తోడ్పడాలని కోరారు.

జయరామ్‌ కోమటి మాట్లాడుతూ, ఎన్నారైలు నవ్యాంధ్ర అభివృద్ధికి మరింతగా ముందుకురావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలుగు ప్రముఖుడు కాట్రగడ్డ కృష్ణ ప్రసాద్‌ కూడా పాల్గొని మాట్లాడారు. ఎన్నారైలు అన్నీ రంగాల్లో రాణించినట్లుగానే అమెరికా రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారని చెప్పారు. జన్మభూమి అభ్యున్నతికి కూడా అందరూ కృషి చేయాలని కోరారు.

బాటా నాయకులు, తానా నాయకులు, ఇండో అమెరికన్స్‌ నాయకులు జస్టిస్‌ చలమేశ్వర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాటా అడ్వయిజర్‌ విజయ ఆసూరి, ఎన్నారై టీడిపి నాయకుడు వెంకట్‌ కోగంటి, రజనీకాంత్‌ కాకర్ల తదితరులు పాల్గొన్నారు.

Click here for Event Gallery