బే ఏరియా ప్రవాసులతో పితాని భేటీ

బే ఏరియా ప్రవాసులతో పితాని భేటీ

06-12-2017

బే ఏరియా ప్రవాసులతో పితాని భేటీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ మిల్పిటాస్‌లోని స్వాగత్‌ సమావేశ మందిరంలో స్థానిక ప్రవాసులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో నూతన రాజధాని అభివృద్ధితో పాటు పలు అంతర్జాతీయ స్థాయి కర్మాగారాల ద్వారా ఉపాధి కల్పనకు రాష్ట్ర యంత్రాంగం సమన్వయ కృషి జరుపుతోందని తెలిపారు. ప్రవాసులు పెట్టుబడులు పెట్టే లక్ష్యంతో రాష్ట్రంలో పర్యటిస్తే తగిన అనుమతులు సజావుగా జారీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం మాట్లాడుతూ ఏపీ జన్మభూమి ద్వారా డిజిటల్‌ తరగతులు వంటి అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా పెట్టుబడులు పెట్టాలనుకునే ప్రవాసులకు మార్గదర్శిగా కూడా వ్యవహరిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కోగంటి వెంకట్‌, కాకర్ల రజనీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Click here for Event Gallery