అమెరికన్‌ తెలంగాణ అసోసియేషన్‌ ఆత్మీయ సమ్మేళనం

అమెరికన్‌ తెలంగాణ అసోసియేషన్‌ ఆత్మీయ సమ్మేళనం

15-02-2018

అమెరికన్‌ తెలంగాణ అసోసియేషన్‌ ఆత్మీయ సమ్మేళనం

టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో జరగనున్న ఆటా తెలంగాణ కన్వెన్షన్‌కు సంబంధించి చర్చించడానికి, ఆటా తెలంగాణ ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చించేందు కోసం అమెరికన్‌ తెలంగాణ అసోసియేషన్‌ (ఆటా) ప్రతినిధులు బే ఏరియాలో ఫిబ్రవరి 15వ తేదీన సమావేశమవుతున్నారు. సన్నివేల్‌లోని 727 ఓల్ఫ్‌రోడ్‌లో ఉన్న సంక్రాంతి ఇండియన్‌ రెస్టారెంట్‌ వద్ద ఈ సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి అమెరికన్‌ తెలంగాణ అసోసియేషన్‌ నాయకులు కరుణాకర్‌ మాధవరం, సత్య కందిమల్ల, నరేందర్‌ చీమెర్ల, శ్రీనివాసరెడ్డి చాడ, వినోద్‌ కకునూర్‌, శ్రీధర్‌ బానాల, రఘువీర్‌ రెడ్డి తదితరులు హాజరవుతున్నారు. స్థానిక బే ఏరియా అమెరికన్‌ తెలంగాణ అసోసియేషన్‌ నాయకులు పూర్ణచందర్‌ బైరి, ఉదయ్‌ జోనల, భాస్కర్‌ మద్ది, రజనీకాంత్‌, నవీన్‌ జలగం, అభిలాష్‌ తదితరులు ఈ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను చూస్తున్నారు.