Telangana Tourism
Karur Vysya Bank
Manjeera Monarch

రూ.4కోట్లు పలికిన మహాత్ముడి స్టాంపులు

20-04-2017

రూ.4కోట్లు పలికిన మహాత్ముడి స్టాంపులు

జాతిపిత మహాత్మాగాంధీ చిత్రంతో ఉన్న అరుదైన స్టాంపులు యూకేలో రికార్డు ధర పలికాయి. యూకేలోని స్టాన్లీ గిబ్బన్స్‌ అనే స్టాంప్‌ కలెక్టింగ్‌ కంపెనీ మహాత్ముడి చిత్రంలో నాలుగు స్టాంపులను వేలం వేయగా, రికార్డు స్థాయిలో 5 లక్షల పౌండ్లు పలికాయి. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.4.1 కోట్లు. వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి వీటిని దక్కించుకున్నారు. యూకేలో ఓ భారత స్టాంప్‌కు ఇంత ధర పలకడం ఇదే తొలిసారి అని వేలం నిర్వాహకులు చెబుతున్నారు.