టైమ్ జాబితాలో మోదీ
APEDB
Ramakrishna

టైమ్ జాబితాలో మోదీ

21-04-2017

టైమ్ జాబితాలో మోదీ

ప్రపంచంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ఇద్దరు భారతీయులకు స్థానం దక్కింది. వారిలో ఒకరు ప్రధాని నరేంద్ర మోదీ కాగా, మరొకరు పేటీఎం వ్యవస్థాపకుడు విజయశేఖర్‌ శర్మ. ప్రజలు ప్రభావితం చేసిన ప్రముఖులతో టైమ్‌ మేగజిన్‌ టాప్‌-100 జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికా, రష్యా అధ్యక్షులు ట్రంప్‌, పుతిన్‌లతో పాటు బ్రిటన్‌ ప్రధారి థెరెసా మే కూడా ఉన్నారు. సంప్రదాయ మీడియాను పక్కనపెట్టి మోడీ ట్విటర్‌ను సమర్థంగా వినియోగిస్తున్నారంటూ రచయిత పంకజ్‌ మిశ్రా టైమ్‌ కథనంలో అభిప్రాయపడ్డారు. ఇక పెద్ద నోట్ల రద్దు వల్ల ఏర్పడిన ప్రతికూల పరిస్థితులను విజయశేఖర్‌ శర్మ తనకు అనుకూలంగా మరల్చుకోగలిగారని ఇన్పోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌నీలేకని తెలిపారు.