వీసాల్లో మార్పులపై మాట్లాడుతాం : జైట్లీ
Nela Ticket
Kizen
APEDB

వీసాల్లో మార్పులపై మాట్లాడుతాం : జైట్లీ

21-04-2017

వీసాల్లో మార్పులపై మాట్లాడుతాం : జైట్లీ

అమెరికా కొత్త వీసాల విధానంపై  ట్రంప్‌ ప్రభుత్వంతో మాట్లాడేందుకు ఆర్థిక మంత్రి జైట్లీ అమెరికా ప్రముఖులతో సమావేశం కానున్నట్లు తెలిసింది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ సమావేశాలకోసం జైట్లీ అక్కడ ఐదు రోజుల పాటు ఉంటారు. ఈ సందర్భంగా అమెరికాలో వీసాలకు సంబంధించిన వ్యవహారంపై అక్కడి అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తామని జైట్లీ చెప్పారు. అమెరికా పర్యటన సందర్భంగా, భారతకు పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా జైట్లీ ప్రయత్నిస్తారు. అమెరికా కంపెనీల సిఇఒలు, పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు.