పండుగలా మహానాడు : కళా

పండుగలా మహానాడు : కళా

17-05-2018

పండుగలా మహానాడు  : కళా

విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈ నెల 27, 28, 29లో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడును ఒక పండుగలా నిర్వహించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు ఆదేశించారు. ఉండవల్లిలో ప్రజాధర్బార్‌ హాల్‌లో ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అధ్యక్షతన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటి వరకు మహానాడు కార్యక్రమానికి చేసిన ఏర్పాట్లపై ఆయన మంత్రులు, నేతలతో చర్చించారు. మూడు రోజులపాటు జరిగే మహానాడులో 31 ముసాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టి చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి 5 ఉమ్మడి తీర్మానాలు ఏపీకి సంబంధించి 18, తెలంగాణకు సంబంధించి 8 తీర్మానాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ తీర్మానాలను ఈ నెల 22 నాటికి సిద్ధం చేసి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేయాలని కళా వెంకట్రావు నేతలకు సూచించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు, అనంతర పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కొందరు నేతలు అధికారం కోసం బీజేపీ చేస్తున్న కుటిల రాజకీయాలను ప్రస్తావించారు.