హైదరాబాద్ వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు

హైదరాబాద్ వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు

17-05-2018

హైదరాబాద్ వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు

హైదరాబాద్‌ వేదికగా మరో ప్రతిష్ఠాత్మక జాతీయసదస్సు జరుగనున్నది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో స్టార్టప్‌ సమ్మిట్‌ ఎక్స్‌పో 2018ను ఈ నెల 18, 19 తేదీలలో నిర్వహించనున్నారు. ఈ ఎక్స్‌పోకు దేశవ్యాప్తంగా ఉన్నవే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాల స్టార్టప్‌ల ప్రతినిధులు హాజరుకానున్నారు. దేశంలో స్టార్టప్‌ సంస్కృతిని పెంపొందించడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఆవిష్కరణలను వ్యాపారబాట పట్టించడం, మహిళ ఆవిష్కర్తలు ఎదిగేందుకు గల అవకాశాలు అన్వేషించడంతోపాటు మరెన్నో అంశాలు విపులంగా చర్చించనున్నారు. ఫ్రాంచైజీ ఇండియా సంస్థ నిర్వహిస్తున్న ఈ సదస్సుకు టై హైదరాబాద్‌, ఓయో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆవిష్కరణల కేంద్రమైన రీచ్‌ (రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌) సపోర్టింగ్‌ పార్ట్‌నర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ సమ్మిట్‌కు దేశవిదేశాల స్టార్టప్‌ సంస్థల ప్రతినిధులతో పాటుగా, విధానకర్తలు, ఇతర రంగాల నిపుణులు హాజరుకానున్నారు.