హైదరాబాద్ కు కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలు?

హైదరాబాద్ కు కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలు?

17-05-2018

హైదరాబాద్ కు కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలు?

కాంగ్రెస్‌, జేడీఎస్‌లు తమ ఎమ్మెల్యేలను గురువారం ఉదయంలోగా కర్ణాటక సరిహద్దులు దాటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీజేపీ నేత యడ్యూరప్ప కర్ణాక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉంటే శాసనసభ్యులను కాపాడుకోలేమని రెండు పార్టీలు భావిస్తున్నాయి. పాలనా పగ్గాలు బీజేపీ చేతుల్లోకి వెళ్లకముందే శాసనసభ్యులను సురక్షిత ప్రాంతానికి తరలించే ఏర్పాట్లను ప్రారంభించాయి. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బెంగళూరు బయట ఈగిల్టన్‌ రిసార్ట్‌లో ఉండగా, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు నగరంలోని షాంగ్రిలా హోటల్లో ఉన్నారు. వీరందర్నీ హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా కాంగ్రెస్‌ జేడీఎస్‌ ఎమ్మెల్యేలను బెంబేలెత్తించే కార్యక్రమంలో భాగంగా వారి ఇళ్లపై ఐటీ దాడులు చేయడం జరగొచ్చని నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఉంచితే పోలీసుల ద్వారా దాడులు చేయించి, ఎమ్మెల్యేలను విడిపిస్తారనే అనుమానం కూడా ఉంది. అందుకే, సురక్షిత మార్గాన్ని ఎంచుకుంటున్నారు.