నా వేగాన్ని కియా అందుకుంటోంది

నా వేగాన్ని కియా అందుకుంటోంది

13-06-2018

నా వేగాన్ని కియా అందుకుంటోంది

నా వేగాన్ని కియా మోటర్స్‌ అందుకుంటోంది అని ఆ కంపెనీ ప్రతినిధులను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. సచివాలయంలో కియా మోటార్స్‌ ఇండియా అనంతపురంలో చేపడుతున్న ప్లాంటు పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. అక్కడ జరుగుతున్న పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్లాంటు సిద్ధమవుతున్న తీరును ఆ కంపెనీ ప్రతినిధులు వీడియో ప్రదర్శన ద్వారా వివరించారు. 2019 జనవరి నాటికి కియా కారు మార్కెట్లోకి రావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సృష్టం చేశారు. ప్లాంటు నిర్మాణాన్ని రియల్‌ టైమ్‌లో పర్యవేక్షించాలని పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. కియా మోటర్స్‌కు కేటాయించిన భూములకు ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అనంతపురం కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. కియాలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నామని ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ కోగంటి సాంబశివరావు వెల్లడించారు. ఈ నెల 20 నుంచి శిక్షణ మొదలవుతుందని చెప్పారు.