అమరావతికి గుర్తింపు తీసుకొస్తా....చంద్రబాబు

అమరావతికి గుర్తింపు తీసుకొస్తా....చంద్రబాబు

14-06-2018

అమరావతికి గుర్తింపు తీసుకొస్తా....చంద్రబాబు

ఫిన్లాండ్‌, నార్వే దేశాలను రోల్‌మోడల్‌గా తీసుకుని ప్రపంచంలోనే అత్యుత్తమ సంతోష నగరంగా అమరావతి రూపుదిద్దుకోనుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.  రాజధాని నిర్మాణంలో ముఖ్య మైన ప్రైవేట్‌ హౌసింగ్‌ , ఆఫీస్‌ స్పేస్‌ ఇతర నిర్మా ణాలతో రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు ముందుకు వచ్చేలా ప్రభుత్వ విధానాన్ని రూపొందించా లని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై దేశంలో పేరుగాంచిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థల సూచనలు తీసుకుని మార్గదర్శ కాలు తయారు చేయాలని, వాటిని మంత్రి మండలిలో చర్చించి ప్రభుత్వ విధానాన్ని ప్రక టి ద్దామని ఆయన అన్నారు.

అగ్రశ్రేణి రియల్‌ ఎస్టేట్‌ సంస్థలతో సచివాలయంలో సీఎం బుధవారం సమావేశమయ్యారు. సిఆర్డీఏ ఆధ్వర్యం లో జరిగిన ఈ సమావేశంలో అమరావతి నిర్మా ణంలో తన ఆలోచనలను వారితో చంద్రబాబు పంచుకున్నారు. మహేంద్ర, షాపూర్‌జి పల్లోంజి, ఎల్‌ అండ్‌ టి, డిఎల్‌ఎఫ్‌, జీవికె తదితర సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అమరావతిని గ్రీన్‌ఫీల్డ్‌ సిటీగా మార్చివేయనున్నామని, ఈ భావి నగరానికి అత్యున్నత సాంకేతికతను మేళవించి అత్యంత ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి డెవలపర్లకు వివరించారు. ఐటి, హెల్త్‌ సిటీగా విశాఖను, అమరావతిని నాలెడ్జి ఎకానమీ సిటీగా, ఎలక్ట్రానిక్‌, హార్డ్‌వేర్‌ సిటీగా తిరుపతిని అభివ ధ్ది చేస్తున్నామని తెలిపారు.

భవిష్యత్‌లో అమరావతి జంట నగరంగా విజయవాడ మారిపోనుందని, మూడు కాల్వలతో విస్తరించి ఉన్న విజయవాడ నగరం, గుంటూరు నగరాన్ని కలుపుకుని రానున్న కాలంలో ఇదొక మహానగరంగా అవతరించనుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఒకనాడు సైబరాబాద్‌ నగరాన్ని జతచేసి మరే రాజధానిలో లేని విధంగా 165 కిలోమీటర్ల మేర అవుటర్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణం చేపట్టి హైద్రాబాద్‌ నగర రూపురేఖలను మార్చివేసిన విషయాన్ని సిఎం వారికి గుర్తు చేశారు. భాగ్యనగరాన్ని తీర్చిదిద్దిన అనుభవం తోనే ఇపుడు కొత్త రాష్ట్రంలో కొత్త నగర నిర్మాణానికి పూనుకున్నామని, రాజధానిని నిర్మించుకోవడం సంక్షోభంలో వచ్చిన సదవకాశంగా భావిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. కొత్తగా దేశంలో నిర్మించిన కొన్ని రాష్ట్రాలకు సంబంధించి చండీగడ్‌ పరిపాలన నగరంగానే ఉండిపోయిందని, నయా రాయపూర్‌, గాంధీనగర్‌ జనసామాన్యానికి దూరంగా నిర్మాణమయ్యాయని అన్నారు. ఢిల్లి, ముంబై నగరాలు నివాసయోగ్యంగా లేక అంతకంతకు విస్తరిస్తున్నాయని, అమరావతి నిర్మించాలని అనుకున్నపుడు ప్రపంచంలో పలు అత్యుత్తమ నగరాలపై అధ్యయనం చేశామని తెలిపారు. అందరికి నివాస యోగ్యమైన ప్రజారాజధానిని నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు.