అమెరికా నుంచి కారులో హైదరాబాద్ కు

అమెరికా నుంచి కారులో హైదరాబాద్ కు

14-06-2018

అమెరికా నుంచి కారులో హైదరాబాద్ కు

కారులో ఆరేడువందల కిలోమీటర్లు ప్రయాణిస్తేనే అలసి పోతాం. అలాంటిది వారు అమెరికా నుంచి హైదరాబాద్‌కు కారులో వచ్చారు. 62 రోజుల పాటు 19 దేశాల మీదుగా 34వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి భాగ్యనగరానికి చేరుకున్నారు. కాలిఫోర్నియా లో స్థిరపడిన వైద్య దంపతులు రాజేశ్‌, దర్శనలు ఈ ఫీట్‌ చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన వీరు 33 ఏళ్ల క్రితం కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. చాన్నాళ్లకు స్వస్థలానికి వెళుతుండటంతో ప్రత్యేక గుర్తింపు కోసం ఈ సాహసానికి పూనుకున్నట్లు చెప్పారు. రూట్‌ మ్యాప్‌తో పాటు ప్రత్యేక వసతులున్న కారు, గుడారం ఇతర పరికరాలను సిద్ధం చేసుకున్నారు. కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్‌కు చేరుకొని, అక్కడ నుంచి కార్గో, ప్యారిస్‌, బ్రెజిల్‌, హంబర్గ్‌, జర్మనీ, డెన్మార్క్‌, స్వీడన్‌, ఫిన్‌ల్యాండ్‌, నెదర్లాండ్స్‌, రష్యా, కజికిస్థాన్‌, కిర్గిస్తాన్‌, చైనా, టిబెట్‌, నేపాల్‌, ముంబై మీదుగా హైదరాబాద్‌ చేరుకున్నారు. సికింద్రాబాద్‌ క్లబ్‌లో బంధుమిత్రులతో సమావేశమై తమ అనుభూతులను పంచుకున్నారు.