సీఎం చంద్రబాబుకు ముస్లిం పెద్దల ఆహ్వానం

సీఎం చంద్రబాబుకు ముస్లిం పెద్దల ఆహ్వానం

14-06-2018

సీఎం చంద్రబాబుకు ముస్లిం పెద్దల ఆహ్వానం

రంజాన్‌ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విజయవాడ ముస్లిం ఈద్గా కమిటీ సభ్యులు ఆహ్వానించారు. జూన్‌ 16న రంజాన్‌ పండుగను పురస్కరించుకుని ఉదయం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నమాజ్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబును ముస్లిం ఈద్గా కమిటీ ఆహ్వానించింది.