బాడీ పెంచడం కాదు... బుర్ర పెంచుకోవాలి

బాడీ పెంచడం కాదు... బుర్ర పెంచుకోవాలి

14-06-2018

బాడీ పెంచడం కాదు... బుర్ర పెంచుకోవాలి

ప్రధాని పదవి అంటే కుస్తీ పోటీ కాదని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌ అన్నారు. ఈ సందర్భంగా జూపూడి మీడియాతో మాట్లాడుతూ మోదీ బాడీ ఫిట్‌నెస్‌ అంటూ ఛాలెంజ్‌లు చేస్తున్నారని అన్నారు. నాయకులు బాడీ పెంచడం కాదని...బుర్ర పెంచుకోవాలని సూచించారు. బ్యాంకులను దోచుకున్న వారిని ప్రధాని కాపాడుతున్నారని ఆరోపించారు. కడప స్టీల్‌ ప్లాంట్‌పై జగన్‌ ఎందుకు డిమాండ్‌ చేయడం లేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ సినిమాలు కాదని అన్నారు. జగన్‌కు నిజమైన సినిమా వచ్చే ఎన్నికల్లో ప్రజలు చూపిస్తారని హెచ్చరించారు. కన్నా పేరుకే బీజేపీ అధ్యక్షుడని, అతడు జగన్‌కు ఏజెంట్‌ అని విమర్శలు గుప్పించారు.