నాగవైష్టవి కేసులో కోర్టు తీర్పు ఇది

నాగవైష్టవి కేసులో కోర్టు తీర్పు ఇది

14-06-2018

నాగవైష్టవి కేసులో కోర్టు తీర్పు ఇది

ఎనిమిదిన్నరేళ్ల క్రితం విజయవాడలో సంచలనం సృష్టించిన చిన్నారి పలగాని నాగవైష్టవి అపరహరణ, హత్య కేసులో విజయవాడలోని మహిళా సెషన్స్‌ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ముగ్గురు నిందితులు మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీశ్‌, వెంకటరావుగౌడ్‌లకు న్యాయమూర్తి జీవిత ఖైదు విధించారు. హత్య, అపహరణ నేరాలు రుజువు కావడంతో నేరస్తులు జీవిత ఖైదు విధిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఉమ్మడి రాష్ట్రం విజయవాడలో 2010 జనవరిలో జరిగిన పలగాని నాగవైష్టవి హత్య కేసు తుది తీర్పు ఎనిమిదేళ్ల తర్వాత వెల్లడైంది. జనవరి 30న చిన్నారి వైష్టవిని కిడ్నాప్‌ చేసి చంపేశారు. తర్వాత ఆమె శవాన్ని బాయిలర్‌లో వేసి బూడిద చేశారు.