కేంద్రంపై సీఎం చంద్రబాబు ఫైర్

కేంద్రంపై సీఎం చంద్రబాబు ఫైర్

14-06-2018

కేంద్రంపై సీఎం చంద్రబాబు ఫైర్

కేంద్రం ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫైర్‌ అయ్యారు. అభివృద్ధికి సహకరించాలి గాని అడ్డుకోకూడదని కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. విభజన సమస్యలు, ఢిల్లీలో నీతి అయోగ్‌ సమావేశంలో చరించాల్సిన అంశాలపై చంద్రబాబు సమీక్షించారు. కేంద్రం సహకారం లేకున్నా నాలుగేళ్లలో 10.5 శాతం వృద్ధి రేటును సాధించామని అన్నారు. వరుసగా మూడేళ్లనుంచి రెండంకెల వృద్ధి రేటు నమోదు చేశామని ఆయన చెప్పారు. కేంద్రానికి పన్నులు చెల్లిస్తున్నా న్యాయబద్ధంగా రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు కేంద్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు లేకున్నా ఖర్చు చేస్తున్నామని, పోలవరంలో డయాఫ్రంవాల్‌ విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు. పోలవరం విషయంలో మన వాదనలు గట్టిగా వినిపించాల్సి ఉంది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత నిధుల విడుదలో ఆలస్యం సరికాదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని ఇది ప్రజల సెంటిమెంట్‌ అని అన్నారు.