కన్నాపై నేను.. జగన్ పై నా కుమార్తె పోటీ

కన్నాపై నేను.. జగన్ పై నా కుమార్తె పోటీ

11-07-2018

కన్నాపై నేను.. జగన్ పై నా కుమార్తె పోటీ

ప్రధాని మోదీ రాష్ట్రంలో ముగ్గురు (పవన్‌, జగన్‌, కన్నా) దొంగలతో కలిసి అధికారం కోసం ప్లాన్‌ చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్‌, ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ విమర్శించారు. టీడీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో మంత్రిగా కన్నా అత్యంత అవినీతికి పాల్పడ్డారు. రాష్ట్రానికి కన్నం వేశారు. ఆయన అవినీతిపై విచారణ జరిపించాలని ఎంపీ రాయపాటి సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దాంతో రక్షణ కోసం కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వెళ్లారు. చంద్రబాబు ఆదేశిస్తే గుంటూరులో కన్నాపై నేను, జగన్‌పై నా కుమార్తె పోటీకి సిద్దం అని సవాల్‌ విసిరారు. జగన్‌ రాష్ట్రానికి పట్టిన సైతాన్‌ అని విమర్శించారు. పవన్‌, చిరంజీవి ఇద్దరు దొంగలేనన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు వారి సామాజికవర్గం చెందినవారు కోట్ల ఆస్తులు అమ్మి ఖర్చుపెడితే, కనీసం పట్టించుకోకుండా మూటముల్లె సర్దుకుని, పార్టీని అమ్మేసి, కేంద్ర మంత్రి పదవి తెచ్చుకున్నారు. సొంత ఊళ్లో మహిళ చేతిలో ఓటమిపాలయ్యారు. పవన్‌కు కూడా అదే గతి పడుతుంది. పీఆర్పీకి 16 సీట్లన్నా వచ్చాయి. వపన్‌కు ఒక్కటీ రాదు అని సృష్టం చేశారు.