విదేశీ పర్యాటకులకు భారత్ షాక్

విదేశీ పర్యాటకులకు భారత్ షాక్

11-07-2018

విదేశీ పర్యాటకులకు భారత్ షాక్

దేశానికి వచ్చే విదేశీ టూరిస్టులకు అందించే ఉచిత సిమ్‌కార్డుల స్కీమ్‌ను భారత ప్రభుత్వం నిలిపివేసింది. భారత్‌తో అడుగుపెట్టే విదేశీయులు తమ కుటుంబాలతో సంబంధాలు కోల్పోతారు. దీంతో వారికి నిత్యం అందుబాటులో ఉంటూనే వివిధ ప్రాంతాలను సందర్శించే ఉద్దేశంతో పర్యాటక మంత్రిత్వశాఖ వారికి ఉచితంగా సిమ్‌ కార్డులు అందించేది. వీసాలు ఇచ్చే సమయంలోనే ముందుగానే యాక్టివేట్‌చేసి సిమ్‌కార్డులు వారికి అందజేసేది. గతేడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే కొత్తగా ఈ పథకాన్ని ఎత్తివేస్తున్నట్లు టూరిజం సెక్రటరీ రష్మీ వర్మ తెలిపారు. పర్యాటకుల్లో దాదాపు అందరూ సోషల్‌ మీడియా యాప్స్‌ను వాడుతున్నారని, అలాగే విమానాశ్రయాలు సహా చాలా ప్రాంతాల్లో పబ్లిక్‌ వైఫై అందుబాటులో ఉండడంతో దానిని ఉపయోగించుకుని వారి కుటుంబాలతో ప్రతి నిత్యం వారి బాగోగులు తెలుసుకుంటారని వర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో సిమ్‌ల అవసరం లేదని గుర్తించి ఈ పథకాన్ని ఎత్తివేసినట్లు తెలిపారు.