ఏపీకి మంత్రి కేటీఆర్ అభినందనలు
MarinaSkies
Kizen

ఏపీకి మంత్రి కేటీఆర్ అభినందనలు

11-07-2018

ఏపీకి మంత్రి కేటీఆర్ అభినందనలు

సులభతర వాణిజ్య నిర్వహణ ర్యాంకుల్లో మొదటి స్థానాన్ని తాము 0.09 శాతం స్వల్ప తేడాతో కోల్పోయామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్ఫూర్తిదాయక నాయకత్వం, అధికారయంత్రాంగం సమర్థ పనితీరుతో ఈ సంవత్సరం కూడా మంచి స్థానాన్ని పొందామన్నారు. మొదటి స్థానం పొందిన చంద్రబాబునాయుడు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఆయన అభినందనలు తెలియజేశారు.