పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణ

పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణ

11-07-2018

పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణ

శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ చేస్తున్నట్లు హైదరాబాద్‌ పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లో గృహనిర్బంధంలో ఉన్న ఆయనను అదుపులోకి తీసుకుని ఇంటి నుంచి తరలించారు. అయితే ఆయనను ఎక్కడికి తరలించారనే విషయాన్ని మాత్రం పోలీసులు సృష్టం చేయలేదు. గత ఏడాది నవంబర్‌లో రాష్ట్రీయ హిందూసేన సమావేశంలో పరిపూర్ణానంద స్వామి చేసిన ప్రసంగంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయనకు నగర బహిష్కరణ నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఆయన ఆరు నెలల పాటు నగరంలోకి ప్రవేశించకూడదని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బహిష్కరణకు గురైన తొలి వ్యక్తి కత్తి మహేశ్‌ కాగా, రెండో వ్యక్తి స్వామి పరిపూర్ణానంద.