అన్న క్యాంటీన్ల ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

అన్న క్యాంటీన్ల ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

11-07-2018

అన్న క్యాంటీన్ల ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

అందరూ కడుపునిండా తినాలనే సదుద్దేశంతోనే అన్న క్యాంటీన్లను ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో ఎ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన అన్నక్యాంటిన్ల ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. క్యాలిటీ, క్యాంటిటీ విషయంలో రాజీపడకుండా పేదలకు ఆహారం అందిస్తామన్నారు. క్యాంటీన్ల నిర్వహణ పాదర్శకంగా ఉండేందుకు ప్రజల నుంచి అభిప్రాయసేకరణ చేస్తామన్నారు. రాష్ట్రంలో 203 అన్న క్యాంటీన్ల ద్వారా 2.50 లక్షల మందికి అల్పాహారం, భోజనం అందిస్తామన్నారు. పేదలు, వృద్ధులకు అన్నక్యాంటీన్లు ఒక వరమని అన్నారు. దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇచ్చినా స్వీకరిస్తామని తెలిపాను. అన్ని బిల్లును ఆన్‌లైన్‌లో చెల్లించేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆగస్టు 15 నాటికి 203 క్యాంటీన్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ఈ రోజు తన జీవితంలో మంచి రోజు అని పేర్కొన్నారు. అన్నదానంలో నిరంతరం ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.