పోలవరానికి సహకరిస్తాం : గడ్కరీ

పోలవరానికి సహకరిస్తాం : గడ్కరీ

12-07-2018

పోలవరానికి సహకరిస్తాం : గడ్కరీ

కేంద్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పోలవరం ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టు నిర్మాణ పనులపై రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసపు జల్లులు కురిపించారు. పోలవరానికి కావాల్సిన నిధులు, అనుమతులన్నింటిని సకాలంలోనే అందిస్తామని పోలవరం నిర్మాణ పురోగతి భేష్‌ అని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును తాను చాలాకాలంగా సందర్శించాలని అనుకుంటుండగా ఆలస్యమైంది. అందరికీ తెలుసని చమత్కరించారు. పది మాసాల తర్వాత తాను రావడం జరిగిందని ప్రాజెక్టు విషయంలో కొన్ని సమస్యలున్నాయని అన్నీ వివరించాలంటే సాధ్యం కాదని మీడియాతో అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పునరావసం ఆర్‌ అండ్‌ ఆర్‌లతో పాటు గిరిజనుల నివాసం ఉన్న ప్రాంతాలు సీఎం అడిగిన విధంగా పరిష్కరిస్తామని ఆయన సృష్టం చేశారు. అలాగే తాను కూడా రైతునేనని ప్రాజెక్టుల విషయంలో తనకు అవగాహన ఉందని పోలవరం జాతీయహోదా ఇవ్వడం జరిగిందని పోలవరాన్ని రాజకీయాలతో ముడిపెట్టిరాదని ఆయన సృష్టం చేశారు. ఏప్రిల్‌ నాటికి సివిల్‌ పనులన్నీ పూర్తిచేస్తామని అధికారులు గడ్కరికీ తెలియజేయడంతో ఫిబ్రవరి మాసంలోనే పనులు పూర్తిచేయాలని ఆయన కోరారు.

జెడ్‌ గ్రౌండింగ్‌ పనులను పూర్తిచేశామని  ఫిబ్రవరి నాటికి కాంక్రిట్‌ పనులు పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి గడ్కరీతో అన్నారు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరానికి భూసేకరణకే రూ.33 వేల కోట్లు ఖర్చు అవుతోందని ఇప్పటివరకు ప్రాజెక్టుకు ఖర్చు చేసిన వ్యయంలో రూ.2200కోట్లు బకాయిలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కోరారు. కొత్త అంచనాల మేరకు రూ.57,940 కోట్లు ఖర్చువుతుందని బకాయిలతో కలుపుకోని అడ్వాన్సుగా రూ.10వేల కోట్లు విడుదల చేయాలని కోరారు. గడ్కరీ తాను కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో చర్చించి వీలయినంత త్వరతగతిని నిధులను విడుదల చేస్తామనా ఆయన హామీ ఇచ్చారు. ప్రధాన మంత్రి మోదీ, తాను పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని ఏ విషయాన్ని కూడా రాజకీయాలతో ముడిపెట్టడం ఎవరికీ అవసరం లేదని పోలవరం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అభివృద్ధి కూడా బాగానే జరుగుతుందని ఆయన కితాబిచ్చారు.