శ్రీసిటీలో మరో భారీ పరిశ్రమ

శ్రీసిటీలో మరో భారీ పరిశ్రమ

12-07-2018

శ్రీసిటీలో మరో భారీ పరిశ్రమ

టెక్స్‌టైల్‌ మెటీరియల్‌, ఫ్యాబ్రిక్‌ తయారీలో ప్రపంచ గుర్తింపు పొందిన జపాన్‌కు చెందిన టోరే సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో తన నూతన పరిశ్రమ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలోని శ్రీసిటీలో జరిగిన ఈ కార్యక్రమానికి పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. టోరే ఇండస్ట్రీస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించనున్న జపాన్‌ కంపెనీ ఇక్కడ రూ.1000 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. టెక్స్‌టైల్‌ మెటీరియల్‌ ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన టోరే శ్రీసిటీలో 85 ఎకరాల్లో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. కాగా, కంపెనీ ఏర్పాటుకు ఏపీని ఎంచుకున్న టోరే యాజమాన్యానికి మంత్రి అమర్నాథరెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తొలివిడతలో 130 మందికి ప్రత్యక్షంగా 520 మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది.