తాజ్ ను పరిరక్షిస్తారా? కూల్చేస్తారా?
Sailaja Reddy Alluddu

తాజ్ ను పరిరక్షిస్తారా? కూల్చేస్తారా?

12-07-2018

తాజ్ ను పరిరక్షిస్తారా? కూల్చేస్తారా?

చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ను పరిరక్షించే విషయమై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం, కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు నిప్పులు చెరిగింది. మమ్మల్ని మూసేయమంటారా లేక మీరు తాజ్‌ను పరిరక్షిస్తారా? లేక కూల్చేస్తారా? అని జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాల ధర్మాసనం ప్రశ్నించింది. అక్కడ విపరీతమైన కాలుష్యం పేరుకుంది. పరిరక్షణకు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని పార్లమెంటరీ స్థాయీ సంఘం ఆక్షేపించింది. అయినా పట్టించుకోరు. తక్షణం ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయండి. కాలుష్య కారకాలను తొలగించే పని చేపట్టండి అని యూపీ సర్కార్‌ను ఆదేశించింది. యూపీకి, కేంద్రానికి మూడు వారాల గడువు ఇస్తూ ఆలోగా నిర్దిష్ట చర్యలు ఆరంభం కాకపోతే తామే రోజువారీ వాదనలు వింటామని బెంచ్‌ తేల్చిచెప్పింది.