నేనింకా 20వ శతాబ్దంలోనే ఉన్నా

నేనింకా 20వ శతాబ్దంలోనే ఉన్నా

12-07-2018

నేనింకా 20వ శతాబ్దంలోనే ఉన్నా

సోషల్‌ మీడియాలో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లదే హవా. వీటిలో చాలా మంది రాజకీయనాయకులు ఎక్కువగా వినియోగిస్తున్న సమాచార మాధ్యమం ట్విట్టర్‌. చిన్నదైనా, పెద్దదైనా, దేనిగురించైనా ట్విట్టర్‌ ద్వారానే పంచుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని ప్రధాని నుంచి మంత్రుల వరకు అందరూ దీని ద్వారా సామాన్యులకు టచ్‌లో ఉంటున్నారు. అందుకే చాలా మంది ట్విట్టర్‌లో ఉండటానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. తాజాగా ఇదే విషయమై మాజీ ఉపరాష్ట్రపతి హమిద్‌ అన్సారీని అడిగితే, తనకు అంత అవసరం లేదన్నట్టుగా సమాధానమిచ్చారు. తనకు ట్విట్టర్‌లో జాయిన్‌ అవ్వాలన్న కోరిక లేదన్నారు. సాంకేతికంగా చెప్పాలంటే తానింకా 20వ శతాబ్దంలోనే ఉన్నానని, తన దగ్గర కంప్యూటర్లు, పుస్తకాలున్నాయన్నారు. వాటిలో చాలా సంతోషంగా ఉన్నానని జవాబిచ్చారు.