ఈ నెల 16 నుంచి పోరాట యాత్ర

ఈ నెల 16 నుంచి పోరాట యాత్ర

12-07-2018

ఈ నెల 16 నుంచి పోరాట యాత్ర

ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పోరాట యాత్ర ఈ నెల 16న ప్రారంభించనున్నారు. ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఆయన యాత్ర ప్రారంభమవుతుందని పార్టీ వర్గాల సమాచారం. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో పవన్‌ పోరాట యాత్ర ఇటీవలే ముగిసింది. ఉభయ గోదావరి జిల్లాల యాత్రను ఆయన తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభించాలని భావించారు. వైకాపా అధ్యక్షుడు జగన్‌ పాదయాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతున్న నేపథ్యంలో, అదే సమయంలో పవన్‌ కూడా పోరాటయాత్ర చేస్తే శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుంనది పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమచారం. ఈ నేపథ్యంలో మొదట పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పోరాటయాత్ర చేయాలని పవన్‌ నిర్ణయించినట్టు తెలిసింది.