అగ్ని పర్వతంతో మాట్లాడవలసి ఉంది

అగ్ని పర్వతంతో మాట్లాడవలసి ఉంది

09-08-2018

అగ్ని పర్వతంతో మాట్లాడవలసి ఉంది

విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ, చాలా మందికి సహాయపడుతూ ఉంటారని అందరికి తెలుసు. తాజాగా ఆమెను ఓ వ్యక్తి విచిత్రమైన సలహా అడిగారు. అందుకామే అంతే సరదాగా సమాధానం చెప్పారు. ఇండోనేషియాలోని బాలిలో ఓ అగ్ని పర్వతం గత నెలలో చాలాసార్లు పేలింది. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళాలనుకున్న సుశీల్‌ కే ఆర్‌ రాయ్‌ ఓ ట్వీట్‌లో సుష్మా స్వరాజ్‌ను సలహా అడిగారు. బాలీకి వెళ్ళడం సురక్షితమేనా? 11.8.18 నుంచి 17.8.18 వరకు బాలీ వెళ్ళాలనుకుంటున్నాం. వెళ్ళడం సురక్షితమేనా? మన ప్రభుత్వం ఏదైనా సూచనను విడుదల చేసిందా? త్వరగా మాకు మార్గదర్శనం చేయండి అని సుష్మా స్వరాజ్‌ను కోరారు. దీనికి సుష్మా స్వరాజ్‌ బదులిస్తూ నేను అగ్ని పర్వతాన్ని సంప్రదించాలి అని ట్వీట్‌ చేశారు.