రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్

09-08-2018

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్

2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్డీయే ప్రభుత్వానికి మరో విజయం దక్కింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికలో అధికార పక్షాల అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ 20 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికలో హరిశంశ్‌కు 125 ఓట్లు రాగా, ప్రతిపక్షాల అభ్యర్థి, కాంగ్రెస్‌ నేత హరిప్రసాద్‌కు 105 ఓట్లు దక్కాయి. దీంతో కొత్త డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ పేరును రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు. రాజ్యసభలో ప్రస్తుతం 244 మంది సభ్యులున్నారు. అయితే నేటి ఎన్నికకు ఆమ్‌ ఆద్మీ పార్టీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సహా 14 మంది సభ్యులు దూరంగా ఉన్నారు. దీంతో సంఖ్యాబలం 230కి తగ్గింది. ఇందులో 125 మంది సభ్యుల మద్దతుతో ఎన్డీయే అభ్యర్థి విజయం సాధించారు.