ప్రవాస భారతీయులకు పరోక్ష ఓటింగ్

ప్రవాస భారతీయులకు పరోక్ష ఓటింగ్

10-08-2018

ప్రవాస భారతీయులకు పరోక్ష ఓటింగ్

సర్వీస్‌ ఓటర్ల తరహాలోనే ప్రవాస భారతీయులకు పరోక్ష ఓటింగ్‌ సదుపాయం కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును, లోక్‌సభ ఆమోదించింది. ప్రజాప్రాతినిధ్య (సవరణ) బిల్లు -2017ను ప్రవేశపెడుతూ, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు ప్రవాసులకు ఇది ఉపయోగపడుతుందని న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. ఈ బిల్లు అమలులోకి వస్తే 3.10 కోట్ల మంది ప్రవాస భారతీయులు రానున్న ఎన్నికల్లో కీలకపాత్ర పోషించనుండటం గమనార్హం.