సింగపూర్ వెళ్లాలనుకుంటున్న ప్రయాణికులకు శుభవార్త

సింగపూర్ వెళ్లాలనుకుంటున్న ప్రయాణికులకు శుభవార్త

10-08-2018

సింగపూర్ వెళ్లాలనుకుంటున్న ప్రయాణికులకు శుభవార్త

విజయవాడ నుంచి విమానంలో నేరుగా సింగపూర్‌ వెళ్లాలనుకుంటున్న ప్రయాణికులకు శుభవార్త. హైదరాబాద్‌ వెళ్లి అక్కడి నుంచి సింగపూర్‌ వెళ్లే పరిస్థితి ఇక ఉండదు. విజయవాడ నుంచే నేరుగా సింగపూర్‌కు విమానాన్ని నడపనున్నారు. లోటు భర్తీ నిధి (వీజీఎఫ్‌) పద్ధతిలో సింగపూర్‌కు విమానాన్ని నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దేశీయ విమాన సంస్థ ఇండిగో వారానికి రెండు మూడు సార్లు సింగపూర్‌కు విమానాన్ని నడిపేందుకు ముందుకు రావడంతో రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌) అనుమతించింది. ఈ నెల 27 నుంచి సేవలు ప్రారంభించాలా? అక్టోబరు 2 నుంచి విమానాన్ని నడపాలా? అనే విషయంలో ఇంకా సృష్టత రావాల్సి ఉంది. 60 సీట్లుండే ఈ విమానాన్ని వారంలో విజయవాడ నుంచి రెండు, మూడు సార్లు తిప్పేలా ఏర్పాటు చేస్తున్నారు.