హజ్ యాత్రికులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

హజ్ యాత్రికులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

10-08-2018

హజ్ యాత్రికులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

రాష్ట్రం నుంచి హజ్‌ యాత్రకు వెళ్తున్న ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ సాయంతో 2348 మంది ముస్లింలు హజ్‌ యాత్రకు సిద్ధం కాగా, మొదటి విడతగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 200 మంది బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా అమరావతిలోని ప్రజావేదిక వద్ద ముస్లింలు సభ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబును సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 2019లో గన్నవరం విమానాశ్రయం నుంచే హజ్‌కు విమానాలు బయలుదేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కడపలో రూ.12 కోట్లతో హౌజ్‌హౌస్‌ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. అలాగే విజవాయడలో రూ.80 కోట్లతో హౌజ్‌ హౌస్‌కు శంకుస్థాపన చేశామన్నారు. 225 షాధీఖానాల నిర్మాణానికి రూ.20 కోట్లు బడ్జెట్‌ పెట్టామని తెలిపారు. హజ్‌ యాత్రికులపైనా కేంద్రం జీఎస్టీ విధిస్తూ ఉండటం దారుణమని మండిపడ్డారు. ముస్లిం మైనారిటీల ఉన్నత చదువులకు రూ.10-15 లక్ష సాయం చేస్తున్నామని తెలిపారు. వక్ఫ్‌ బోర్డు ఆస్తులను కాపాడే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.