విశాఖలో 13 ఐటీ సంస్థలు ప్రారంభం

విశాఖలో 13 ఐటీ సంస్థలు ప్రారంభం

10-08-2018

విశాఖలో 13 ఐటీ సంస్థలు ప్రారంభం

2024 నాటికి రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. విశాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన 13 ఐటీ కంపెనీలను ఆయన ప్రారంభించారు. అలాగే మరో నాలుగు కంపెనీల విస్తరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు, ఎలక్ట్రానిక్స్‌ రంగంలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

విశాఖలో బిజినెస్‌ ప్రోసెస్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ అందిస్తున్న సీఈఎస్‌ లిమిటెడ్‌, వీఎల్‌ఎస్‌ఐ అండ్‌ ఎంబెడెడ్‌ సాఫ్ట్‌వేర్‌ సెక్టార్‌కు గ్లోబల్‌ డిజైన్‌ సర్వీసెస్‌ అందిస్తున్న సెరియం సిస్టమ్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌, ఐఓటి, బ్లాక్‌ చైనా టెక్నాలజీ సర్వీసెస్‌ అందిస్తున్న సహస్రమయ టెక్నాలజీస్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అందిస్తున్న వెలాంటా కేపీఓ అకౌంటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వంటి సంస్థలు నూతన కంపెనీలను ప్రారంభించాయి.

అఫ్షోర్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌ అందిస్తున్న సింబయోసిస్‌, ఇన్స్‌ పైర్‌ ఎడ్జ్‌ ఐటీ సొల్యూషన్స్‌ ఎంటర్ప్రైజ్‌ అప్లికేషన్స్‌, టెలికాం ఎక్సపెన్స్‌ మ్యానేజ్మెంట్‌ సర్వీసెస్‌ అందిస్తున్న ఇన్స్‌ ఫైర్‌ ఎడ్జ్‌ ఐటీ సొల్యూషన్స్‌, కాన్డ్యూయెంట్‌ బీపీఓ సర్వీసెస్‌ అందిస్తున్న పాత్రా ఇండియా బీసీఓ సర్వీసెస్‌ వంటి కంపెనీలు విశాఖలో విస్తరించి వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. వారందరికి ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి లోకేష్‌ కృతజ్ఞతలు తెలిపారు.