కేరళకు ఏపీ రూ. 51 కోట్లు

కేరళకు ఏపీ రూ. 51 కోట్లు

12-09-2018

కేరళకు ఏపీ రూ. 51 కోట్లు

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ. 51 కోట్ల సాయాన్ని అందించనుంది. ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఈ సాయాన్ని అందించనున్నారు. ఇందులో రూ. 35 కోట్ల నగదుకు సంబంధించిన చెక్కులు రూ.16 కోట్ల విలువైన సహాయ సమాగ్రి ఉన్నట్లు రియల్‌టైమ్‌ గవర్నెర్స్‌ సొసైటీ ఓ ప్రకటనలో తెలిపింది.