చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్

చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్

12-09-2018

చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్

భారత మహిళల కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో అత్యధిక వన్డేలకు నాయకత్వం వహించిన అరుదైన ఘనతను అందుకుంది. ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మిథాలీ ఈ ఘనత సాధించింది. ఇప్పటిదాక 195 వన్డేలు ఆడిన హైదరాబాదీ ఎస్‌ మిథాలీ.. 118 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించింది. దీంతో అత్యధికంగా 117 వన్డేలకు కెప్టెన్సీ వహించిన ఇంగ్లండ్‌ మాజీ మహిళా క్రికెటర్‌ చార్లెట్‌ ఎడ్వర్జ్స్‌ పేరిటనున్న ప్రపంచ రికార్డును మిథాలీ బద్దలుకొట్టింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ క్రిడాకారిణి బెలిండా క్లార్క్‌,(101) మూడో స్థానంలో ఉంది. ఇప్పటిదాక ఈ ముగ్గురు మాత్రమే వందకు పైగా మ్యాచ్‌లకు నాయకత్వం వహించారు.