ఖైరతాబాద్ లో అక్కా-తమ్ముళ్ల సవాల్ ?

ఖైరతాబాద్ లో అక్కా-తమ్ముళ్ల సవాల్ ?

12-09-2018

ఖైరతాబాద్ లో అక్కా-తమ్ముళ్ల సవాల్ ?

పీజేఆర్‌ తనయుడు, కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే విష్ణు జూబ్లీహిల్స్‌ నుంచి కాకుండా ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి మారితే ఏం చేద్దామనే చర్చ టీఆర్‌ఎస్‌ అధిష్టానం ముఖ్యుల్లో నడుస్తోంది. కాంగ్రెస్‌, టీడీపీ పొత్తులో భాగంగా జూబ్లీహిల్స్‌ నుంచి టీడీపీ పోటీ చేస్తుందని, విష్ణు ఖైరతాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసే అవకాశం ఉందనే సమాచారం టీఆర్‌ఎస్‌ ముఖ్యులకు ఉంది. ఖైరతాబాద్‌లో టీఆర్‌ఎస్‌ తరపున టికెట్‌ పీజేఆర్‌ కూతురు విజయారెడ్డికి ఇవ్వాలని యోచిస్తున్నారు. విష్ణు ఖైరతాబాద్‌కు మారితే అక్కాదమ్ముళ్లు ఒకే స్థానం నుంచి పోటీ పడాల్సి వస్తుంది. దానం నాగేందర్‌కు టీఆర్‌ఎస్‌ తరపున గోషామహల్‌ టికెట్‌ దాదాపుగా ఖాయమైందని సమచారం.