100 కాదు.. వచ్చేది పది స్థానాలే

100 కాదు.. వచ్చేది పది స్థానాలే

12-09-2018

100 కాదు.. వచ్చేది పది స్థానాలే

టీఆర్‌ఎస్‌కు 100 సీట్లు కాదు.. వచ్చేది పది స్థానాలే అని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ జోష్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అన్ని నియోజకవర్లాలో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. యువత రాజకీయాల్లోకి రావాలన్న రాహుల్‌ గాంధీ పిలుపుతో అనిరుద్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారని అన్నారు. ముందస్తు ఎన్నికలు కేసీఆర్‌ పుట్టి ముంచడం ఖాయం అన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న డబ్బుతో మళ్లీ అధికారంలోకి వస్తానని కేసీఆర్‌ కలలు కంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలుపును అడ్డుకోవడం కేసీఆర్‌ తరం కాదన్నారు. కేసీఆర్‌ను తరమికొట్టే బాధ్యత యువతపై ఉందని పేర్కొన్నారు. జడ్చర్లలో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం అన్నారు.